శ్రీ వేంకటేశ తూణకం – Sri Venkatesha Tunakam

వజ్రశంఖబాణచాపచిహ్నితాంఘ్రిపంకజం
నర్తితాయుతారుణాగ్ర్యనిస్సరత్ప్రభాకులమ్ |
వజ్రపాణిముఖ్యలేఖవందితం పరాత్పరం
సజ్జనార్చితం వృషాద్రిసార్వభౌమమాశ్రయే || 1 ||

పంచబాణమోహనం విరించిజన్మకారణం
కాంచనాంబరోజ్జ్వలం సచంచలాంబుదప్రభమ్ |
చంచరీకసంచయాభచంచలాలకావృతం
కించిదుద్ధతభ్రువం వంచకం హరిం భజే || 2 ||

మంగళాధిదైవతం భుజంగమాంగశాయినం
సంగరారిభంగశౌండమంగదాధికోజ్జ్వలమ్ |
అంగసంగిదేహినామభంగురార్థదాయినం
తుంగశేషశైలభవ్యశృంగసంగినం భజే || 3 ||

కంబుకంఠమంబుజాతడంబరాంబకద్వయం
శంబరారితాతమేనమంబురాశితల్పగమ్ |
బంభరార్భకాలిభవ్యలంబమానమౌలికం
శంఖకుందదంతవంతముత్తమం భజామహే || 4 ||

పంకజాసనార్చతం శశాంకశోభితాననం
కంకణాదిదివ్యభూషణాంకితం వరప్రదమ్ |
కుంకుమాంకితోరసం సశంఖచక్రనందకం
వేంకటేశమిందిరాపదాంకితం భజామహే || 5 ||

ఇతి శ్రీ వేంకటేశ తూణకమ్ సంపూర్ణం |