శ్రీ వేంకటేశ భుజంగం – Sri Venkatesha Bhujangam

ముఖే చారుహాసం కరే శంఖచక్రం
గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణమ్ |
తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || 1 ||

సదాభీతిహస్తం ముదాజానుపాణిం
లసన్మేఖలం రత్నశోభాప్రకాశమ్ |
జగత్పాదపద్మం మహత్పద్మనాభం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || 2 ||

అహో నిర్మలం నిత్యమాకాశరూపం
జగత్కారణం సర్వవేదాంతవేద్యమ్ |
విభుం తాపసం సచ్చిదానందరూపం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || 3 ||

శ్రియా విష్టితం వామపక్షప్రకాశం
సురైర్వందితం బ్రహ్మరుద్రస్తుతం తమ్ |
శివం శంకరం స్వస్తినిర్వాణరూపం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || 4 ||

మహాయోగసాద్ధ్యం పరిభ్రాజమానం
చిరం విశ్వరూపం సురేశం మహేశమ్ |
అహో శాంతరూపం సదాధ్యానగమ్యం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || 5 ||

అహో మత్స్యరూపం తథా కూర్మరూపం
మహాక్రోడరూపం తథా నారసింహమ్ |
భజే కుబ్జరూపం విభుం జామదగ్న్యం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || 6 ||

అహో బుద్ధరూపం తథా కల్కిరూపం
ప్రభుం శాశ్వతం లోకరక్షామహంతమ్ |
పృథక్కాలలబ్ధాత్మలీలావతారం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || 7 ||

ఇతి శ్రీవేంకటేశభుజంగం సంపూర్ణమ్ |